You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palశ్రీ మహావిష్ణువు కృష్ణావతారమునకు ముందు చెరసాలలోనున్న వసుదేవునికి కలలో సాక్షాత్కరించి "నేను అవతరించుచున్నాను. నన్ను గోకులంలోనున్న యశోదానందుల వద్ద దింపమని" చెప్పినట్లు ఐతిహ్యం. యేసుక్రీస్తు జననానికి ముందు ఆయన తల్లి మరియమ్మకు కలలో దైవదూతలు కనిపించి "నీ గర్భములో ఒక మహాపురుషుడు జన్మించుచున్నాడు" అని తెలిపినట్లు చెప్పబడినది.
మెలకువగా ఉన్నపుడు బాహ్యావయవాలతో ముడిపడియున్న మనస్సు, బుద్ధి మెదలగు ఇంద్రియాలు నిద్రాసమయములో సూక్ష్మ శరీరంతో సంబంధం కలిగి దానికతీతమైన అంతరప్రకృతికి సంబంధించిన విషయాలలో సంచరించుట వలన స్వప్నాలు కలుగుచున్నాయి. అలా నిద్రలో కలిగే అనుభూతులు, భావనలకే కలలని పేరు.
జ్యోతిశ్శాస్త్రం పంచస్కంధాత్మకం. పంచస్కంధాలలో ఒకటైన సంహితావిభాగంలో స్వప్నశాస్త్రం ఒక ఉపవిభాగం. స్వప్నాలు వ్యక్తుల సమీప మరియు సుదూర భవిష్యత్తుని స్వప్నసమయం మొదలగు పరిస్థితులననుసరించి తెలియజేస్తాయి. కొన్ని పద్దతులను పాటించి కలలో ఏదైనా సమస్యకు పరిష్కారం కూడ కనుగొనవచ్చును. కలలయందు కనిపించే సంఘటనలు, వ్యక్తులు, గుర్తులు, చిహ్నాలు, గాలి, వాయు, నీరు, జంతు, పక్షి, వృక్ష, మనుష్య, భూమి, లోహ, ఆకాశ, దైవ సంబంధిత కలలకు సూక్ష్మమైన తేడాలతో ఫలితాలు ఎలా ఉంటాయో ఈ పుస్తకంలో చూడవచ్చును. చెడు కలలు వచ్చినపుడు దోషనివారణార్ధము చేయవలసిన పనులు మరియు మంచి కలలను పొందుటకు ఆచరించవలసిన పద్ధతులను కూడ చూడవచ్చును.
It looks like you’ve already submitted a review for this book.
Write your review for this book (optional)
Review Deleted
Your review has been deleted and won’t appear on the book anymore.కోటిపల్లి సుబ్బారావు
ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, సిద్ధాంతం గ్రామానికి చెందిన కోటిపల్లి సుబ్బారావు, జాతీయ వ్యవసాయ గ్రామీనాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) నందు వివిధ హోదాలలో హైదరాబాదు, ముంబై, ఢిల్లీ, బెంగుళూరులలో పని చేసి డిప్యూటీ జనరల్ మేనేజరు గా 2010 లో పదవీవిరమణ చేసారు. ప్రాధమికంగా సైన్సు పట్టభద్రుడైనప్పటికి, తరువాత కాలంలో జ్యోతిషంలో మాస్టర్సు డిగ్రీ పొందారు. ఒక వ్యక్తి నివసించే ఇల్లు, అతని ఆరోగ్య సంపదలను, అదృష్టాన్ని సూచిస్తుందని తెలుసుకొన్న తరువాత తెలుగు లో వాస్తు శాస్త్ర విజ్ఞాన సర్వస్వము అనే గ్రంధాన్ని మొదట రచించారు. ప్రస్తుత స్వప్నఫల శాస్త్రం వారి రెండో గ్రంధము. ఇచట కలలు భవిష్యత్తుని ఎలా తెలుపుతాయో వివిధ గ్రంధాలయందలి విషయాలతో మరియు 1491 ఉదాహరణలతో వివరించారు. వీరికి చరిత్రయందు కూడ ప్రవేశమున్నది. ఈ మధ్యనే ఒక చరిత్రకెక్కని స్వాతంత్య్ర సమరయోధుడి గాధను (1860 - 1891) “చరిత్రకందని స్వాతంత్య్ర సమరయోధుడు ద్వారబంధాల చంద్రయ్యదొర" అనే మకుటంతో పుస్తకంగా రచించారు.
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందిన తరువాత డిశంబరు 2019 లో తెలుగు భాషాభివృద్ధి మరియు తెలుగు భాషా వ్యాప్తికి "ప్రపంచ తెలుగు భాషా పరిరక్షణ పార్టీ" అనే రాజకీయ పార్టీని స్థాపించారు.
ఈయన వారి శ్రీమతి మణి గారితో హైదరాబాదు నందు నివసిస్తున్నారు.
The items in your Cart will be deleted, click ok to proceed.