ఒక భయంకర ఉగ్రదాడిలో తన వాళ్లను పోగొట్టుకుని అనాధలా మారి ఉగ్రమూకల వేటకు ,ప్రేమామృతపు గాలుల ఒత్తిడికి మధ్యలో నలుగుతూ దేశం కోసం "మరో శీర్షిక" గా అవతరించిన యువతి ఒకపక్క.....
స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం శత్రుమూకలతో వీరోచితంగా పోరాడుతూ
" మరో శీర్షిక "ను వెతుకుతున్న సైనికుడు ఇంకోపక్క....
తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ రాజకీయ రౌడీల కబంధహస్తాల మధ్యలో నలిగి " మరో శీర్షిక " గా మారిపోయిన యువతి మరో పక్క....
ఈ ముగ్గురి కలయికతో పాఠకులను అనుక్షణం ఉత్కంఠకు గురి చేస్తూ హృదయాలను బరువెక్కించే దేశభక్తితో కూడిన ప్రేమ కథె ఈ " మరో శీర్షిక "
Delete your review
Your review will be permanently removed from this book.