యుద్ధం ప్రారంభం కాకముందే శ్రీకృష్ణుని ద్వారా వెల్లడి చేయబడింది భగవద్గీత కానీ, ప్రజలు తమ బంధువుల మరణానంతరం భగవద్గీత శ్లోకాలను పఠిస్తున్నారు. ఇది మహాపాపం మరియు భగవద్గీతకు అవమానం. భగవద్గీత సర్వ మానవాళికి మార్గదర్శక గ్రంధం. ధర్మమే మన లక్ష్యం; ధర్మాన్ని పాటించే ప్రయత్నం సాధన; ఆ ప్రయత్నంలో విజయం సాధించడం సిద్ధి; సిద్ధి పొందిన తర్వాత ఏ ధర్మం కోసం పోరాడి సిద్ధి సాధించారో అదే ఆదర్శం కోసం జీవించడం యోగం. శ్రీకృష్ణుడన్నా, భగవంతుడన్నా, విశ్వమని మనం అర్థం చేసుకుంటే, ఈ పవిత్ర గ్రంథం నుండి మనకు సరైన సందేశం లభిస్తుంది. శ్రీకృష్ణుడు తానే విశ్వమని, విశ్వమే తానని అనేక శ్లోకాలలో వివరించాడు; యశోదకు తన నోటిలో, అర్జునిడికి కురుక్షేత్రంలో కూడా విశ్వరూప సందర్శనే చేశాడు.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners