"కొన్ని రహస్యాలు వెలుగులోకి రావు.. అవి ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడతాయి!"
మాయాపురం... ఆ ఊరి పొలిమేరల్లో నిశ్శబ్దంగా కొలువై ఉన్న 'పాత గుడి' వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఔరంగజేబు సైన్యం నుండి బ్రిటిష్ ఆఫీసర్ల వరకు... ఆ గుడి గడప దాటిన వారెవరూ తిరిగి రాలేదు. అక్కడ ఉన్నది అంతుచిక్కని నిధా? లేక అంతుచూసే అదృశ్య శక్తా?
టెక్నాలజీని నమ్మే యంగ్ ఆఫీసర్ వంశీ, అత్యాశతో నిధి వేట మొదలుపెట్టిన అశోక్... ఇద్దరి ప్రయాణం ఆ కొండపై ఉన్న మరణ శాసనం దగ్గరే మొదలైంది. గాలిలో కర్పూరంలా మాయమైపోయే మనుషులు, గజ్జెల సవ్వడి చేసే మాయాబాలిక, పది అడుగుల కృష్ణసర్పం... ఇవన్నీ భ్రమలా లేక రాబోయే ప్రళయానికి సంకేతాలా?
సైన్స్ ఓడిపోయిన చోట, మంత్రం ముందు యంత్రం తలవంచిన వేళ... మాయాపుర రక్షకుడిగా ఒక సామాన్యుడు ఎలా నిలబడ్డాడు? ఆ శిలాశాసనంపై రాసిన పేర్ల వెనుక ఉన్న భయంకరమైన నిజం ఏమిటి?
నమ్మకం వెనుక ఉన్న నిజాన్ని.. రహస్యం వెనుక ఉన్న అభయాన్ని తెలుసుకోవాలంటే 'పాత గుడి'లోకి అడుగుపెట్టాల్సిందే!