శ్రీ మహావిష్ణువు కృష్ణావతారమునకు ముందు చెరసాలలోనున్న వసుదేవునికి కలలో సాక్షాత్కరించి "నేను అవతరించుచున్నాను. నన్ను గోకులంలోనున్న యశోదానందుల వద్ద దింపమని" చెప్పినట్లు ఐతిహ్యం. యేసుక్రీస్తు జననానికి ముందు ఆయన తల్లి మరియమ్మకు కలలో దైవదూతలు కనిపించి "నీ గర్భములో ఒక మహాపురుషుడు జన్మించుచున్నాడు" అని తెలిపినట్లు చెప్పబడినది.
మెలకువగా ఉన్నపుడు బాహ్యావయవాలతో ముడిపడియున్న మనస్సు, బుద్ధి మెదలగు ఇంద్రియాలు నిద్రాసమయములో సూక్ష్మ శరీరంతో సంబంధం కలిగి దానికతీతమైన అంతరప్రకృతికి సంబంధించిన విషయాలలో సంచరించుట వలన స్వప్నాలు కలుగుచున్నాయి. అలా నిద్రలో కలిగే అనుభూతులు, భావనలకే కలలని పేరు.
జ్యోతిశ్శాస్త్రం పంచస్కంధాత్మకం. పంచస్కంధాలలో ఒకటైన సంహితావిభాగంలో స్వప్నశాస్త్రం ఒక ఉపవిభాగం. స్వప్నాలు వ్యక్తుల సమీప మరియు సుదూర భవిష్యత్తుని స్వప్నసమయం మొదలగు పరిస్థితులననుసరించి తెలియజేస్తాయి. కొన్ని పద్దతులను పాటించి కలలో ఏదైనా సమస్యకు పరిష్కారం కూడ కనుగొనవచ్చును. కలలయందు కనిపించే సంఘటనలు, వ్యక్తులు, గుర్తులు, చిహ్నాలు, గాలి, వాయు, నీరు, జంతు, పక్షి, వృక్ష, మనుష్య, భూమి, లోహ, ఆకాశ, దైవ సంబంధిత కలలకు సూక్ష్మమైన తేడాలతో ఫలితాలు ఎలా ఉంటాయో ఈ పుస్తకంలో చూడవచ్చును. చెడు కలలు వచ్చినపుడు దోషనివారణార్ధము చేయవలసిన పనులు మరియు మంచి కలలను పొందుటకు ఆచరించవలసిన పద్ధతులను కూడ చూడవచ్చును.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners