You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palసమాజం కోసం నా ఈ చిన్న ప్రయత్నం....
సమాజంలో జరుగుతున్న ప్రతి అన్యాయానికి అనర్ధానికి ముఖ్య కారణం సమాజంలో బ్రతుకుతున్న మనం మరియు మన మౌనం, సమాజంలో ఏదైనా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మనకెందుకులే అని ఉంటున్నాం, అదే అన్యాయం మనకి జరిగితే మాత్రం గొంతు చించుకుని అరుస్తున్నాం, సమాజంలో ఎప్పుడు ఏదో ఒకచోట ఏదో ఒక అన్యాయం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కుడా సమాజంలో జరుగుతున్న ప్రతీ అన్యాయాన్ని ఖండించాలి, ఆ అన్యాయం జరుగుతున్న వారి కోసం ముందుండి పోరాడాలి, అలా చూపించే ప్రయత్నమే ఈ కవిత్వ పుస్తకం, సమాజాన్ని ఎప్పుడూ మన స్నేహితుడు లాగా - సమాజంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని కూడా మన శత్రువులాగ భావిస్తూ మన స్నేహితుడికి సమస్య వస్తే మనం ఎలా ముందుంటామో సమాజంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని మనం ఏదో ఒకరికంగా ఖండించాలి ఆ అన్యాయాన్ని సమాజంలో నుంచి సమాధి చెయ్యాలి, దానికోసం మనం ఎంతటి వరకు అయినా పోరాడాలి, అలా జరిగితేనే తప్పు చేస్తున్న వాడికి మరియు తప్పు చేయాలనుకున్న వారికి సమాజం పట్ల ఒక భయం మరియు బాధ్యత వస్తాది.
అలాగే ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నామంటే దానికి ముఖ్య కారణం రైతన్న కానీ ఈరోజు మనం మన ఆకలి తీర్చుకుంటున్నాం తప్పా రైతు ఆకలితో చస్తున్న విషయం మనం మర్చిపోతున్నాం, అందరూ రైతు పండించిన పండలేక చనిపోయారు అని అనుకుంటున్నాం, కాని మనకు అన్నం పెట్టిన వారి కోసం చేయవలసిన సాయం మరియు తనకోసం పోరాటం చేయకున్నా మనమే పరోక్షంగా అతనిని చంపేస్తున్నాం అని తెలియడం లేదు,
అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి కూడా నేను తోడు ఉన్నాను, నేను నీతో పోరాటం చేస్తాను అని ఒక బలమైన భరోసా ఇస్తే ఎందుకు ఆత్మహత్యలు జరుగుతాయి...?
గణేష్ బెవర
గణేష్ బెవర, 7 నవంబర్ 2001 న, వంతరం గ్రామం, బలిజిపేట మండలం, పార్వతీపురం జిల్లాలో, ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించారు. అతని తండ్రి పేరు రామకృష్ణ మరియు తల్లి పేరు వెంకటమ్మ మరియు సోదరుడు పేరు విష్ణు వర్ధన్. గణేష్ తన ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యను తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి చేశాడు, అతను తన ఇంటర్మీడియట్ విద్య మరియు గ్రాడ్యుయేషన్ ను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్, శ్రీకాకుళం నుండి కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ (CSE) లో పట్టభద్రుడయ్యాడు
The items in your Cart will be deleted, click ok to proceed.