Share this book with your friends

Patha Gudi / పాత గుడి An Elusive Mystery / ఒక అంతుచిక్కని రహస్యం

Author Name: Sarath Chandra Ayyagari | Format: Hardcover | Genre : Literature & Fiction | Other Details

"కొన్ని రహస్యాలు వెలుగులోకి రావు.. అవి ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడతాయి!"

మాయాపురం... ఆ ఊరి పొలిమేరల్లో నిశ్శబ్దంగా కొలువై ఉన్న 'పాత గుడి' వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఔరంగజేబు సైన్యం నుండి బ్రిటిష్ ఆఫీసర్ల వరకు... ఆ గుడి గడప దాటిన వారెవరూ తిరిగి రాలేదు. అక్కడ ఉన్నది అంతుచిక్కని నిధా? లేక అంతుచూసే అదృశ్య శక్తా?

టెక్నాలజీని నమ్మే యంగ్ ఆఫీసర్ వంశీ, అత్యాశతో నిధి వేట మొదలుపెట్టిన అశోక్... ఇద్దరి ప్రయాణం ఆ కొండపై ఉన్న మరణ శాసనం దగ్గరే మొదలైంది. గాలిలో కర్పూరంలా మాయమైపోయే మనుషులు, గజ్జెల సవ్వడి చేసే మాయాబాలిక, పది అడుగుల కృష్ణసర్పం... ఇవన్నీ భ్రమలా లేక రాబోయే ప్రళయానికి సంకేతాలా?

సైన్స్ ఓడిపోయిన చోట, మంత్రం ముందు యంత్రం తలవంచిన వేళ... మాయాపుర రక్షకుడిగా ఒక సామాన్యుడు ఎలా నిలబడ్డాడు? ఆ శిలాశాసనంపై రాసిన పేర్ల వెనుక ఉన్న భయంకరమైన నిజం ఏమిటి?

నమ్మకం వెనుక ఉన్న నిజాన్ని.. రహస్యం వెనుక ఉన్న అభయాన్ని తెలుసుకోవాలంటే 'పాత గుడి'లోకి అడుగుపెట్టాల్సిందే!

Read More...
Hardcover

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

శరత్‌ చంద్ర అయ్యగారి

శరత్‌ చంద్ర అయ్యగారి ప్రముఖ తెలుగు మీడియా చానెల్‌లో జర్నలిస్టుగా, టీమ్‌ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాదాపు 8 ఏళ్ల జర్నలిజం ప్రయాణంలో కథా రచన, రిపోర్టింగ్‌లలో విశేష అనుభవాన్ని సంపాదించారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు తెలుగు రాష్ట్రాల సామాజిక కోణాలను తనదైన శైలిలో విశ్లేషించారు.

సమాజంలోని కనిపించని పొరలు, మరుగునపడిన సంప్రదాయాలను కథల ద్వారా వెలుగులోకి తేవాలనే తపనతో ఆయన తొలి నవల ‘పాత గుడి’ని రచించారు. వాస్తవికతను భావోద్వేగాలతో మేళవిస్తూ నమ్మకం–విజ్ఞానం మధ్య ఉన్న సున్నితమైన రేఖను ఈ కథలో ఆవిష్కరించారు. మానవ సంబంధాలు, దాగి ఉన్న రహస్యాలు, మరియు మనుషుల్లోని చీకటి కోణాలను స్పృశిస్తూ శరత్ చంద్ర గారు రచయితగా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.

Read More...

Achievements