ఆయనతో ఉన్న సమయాలలో మధురం ఆయన సన్నిధిలో ఆయనతో నేను, నాతో ఆయన పంచుకున్న విషయాలు, ఆయన నాకు నేర్పించిన అనేకమైన పాఠాలు, ఆయనతో నేను చేసుకున్న విన్నపాలు, ఆయన నాకు చెప్పిన విషయాలు గత సంవత్సరాలలో ఆయనతో నాకున్న సంబంధం విడిదీయలేనంత పెనువేసుకుని ఆయనలో నేను నాలో ఆయన ఉన్నాడన్న ఎన్నింటికో ఋజువు ఈ పుస్తకం.
ఈ పుస్తకములో ప్రతీ మాట దేవుడు తన కృపద్వారా ఇచ్చిందే. ఇది మీకు, మీ ఆత్మీయజీవితాలకు ఉపయోగపడుతుందని నా బలమైన నమ్మకం. దీని ద్వారా మీరు ప్రభువుతో మరింత దగ్గరగా ఉంటూ నేను పొందిన ఈ అనుభవాన్నే మీరు పొందగలరని ఆశిస్తూ
క్రీస్తులో మీ సహోదరుడు
విజయ్ వారాది