You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palవ్యాధులతో బాధపడుతున్న రోగులకు కొత్త జీవితాలను అందించిన వైద్యుల కథనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వైద్య ప్రయాణంలో కొన్నిసార్లు లేదా ఆ ప్రయాణం ఆసాంతం ఎన్నో ఆసక్తికరమైన, ఉత్సాహభరితమైన ఛాయలు కనిపిస్తాయి. ఆ అందమైన రంగుల ఛాయలను పాఠకులు అనుభవించేలా చేసేందుకు ప్రయత్నమే ఈ పుస్తకం. ఈ పుస్తకం ముగ్గురు వైద్యుల కథను చెబుతుంది. ఇందులో ఒక్కొక్కరిది. ఒక్కో కథ. కానీ మూడు కథల మధ్య కొన్ని సారూప్యతలు ఉంటాయి. ఓవైపు సారూప్యతలు ఉన్నా కూడా వీరి జీవిత కథల మధ్య వైరుధ్యం కూడా ఉంది. వీరి వెలుగుల వెనక మధ్యతరగతి కుటుంబంలో ఉండే పోరాటాలు, వారి పిల్లలు తమ కంటే చాలా పెద్ద జీవితాన్ని గడపడానికి, వారి నెరవేరని కలలను ముందుకు తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు పడే కష్టాలు కనిపిస్తాయి. ఈ కథలలో తమ కలలను నెరవేర్చుకోడానికి చూపిన అంకిత భావం, దాని కోసం చేసిన త్యాగాలు ఉంటాయి. అయితే వీటన్నింటి మధ్య కామన్ గా కనిపించే అంశం ఒకటుంది. దాని పేరే గెలుపు. అవరోధాలన్నింటినీ అధిగమిస్తూ సాగిన వీరి విజయ ప్రస్థానంలో.. ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఉన్నాయి. ఒక్కొక్కరి విజయగాధలో తల్లిదండ్రుల కోరికలను నెరవేర్చిన ఆనందం కనిపిస్తుంది. అంతకు మించిన ఎన్నో ఉత్తేజకరమైన, ఉల్లాసభరితమైన సందర్బాలూ ఉన్నాయి. వీళ్లందరి ప్రథమ కర్తవ్యం రోగులకు చికిత్స చేయడమే. రోగికి పునర్జన్మ ఇవ్వడం, అన్ని ఆరోగ్య సమస్యల నుంచి రోగికి విముక్తి కల్పించడమే వీరి లక్ష్యం. పూర్తి నిరాశ, నిస్పృహలతో నిండిన రోగికి జీవితంపై ఆశ చిగురించేలా చేయడం. ఇలాంటి లక్ష్యాలు, కర్తవ్యాలను నెరవేర్చుకోవడంలోనే వీళ్లంతా ఆనందాన్ని వెతుక్కున్నారు. ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరికి విజయగాధలు ఉన్నాయి. చేసిన పోరాటాలు, పడిన కష్టాలే జీవితంలో అగ్నిపరీక్షలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చాయి.
It looks like you’ve already submitted a review for this book.
Write your review for this book (optional)
Review Deleted
Your review has been deleted and won’t appear on the book anymore.డాక్టర్. అరవింద్ యాదవ్
డాక్టర్ అరవింద్ యాదవ్...జర్నలిస్టుగా ఇరవై ఐదేళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఆయనది. పాత్రికేయుడిగా ఆయన ఎన్నో సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి. ఆయన తన అనుభవాలన్నింటినీ రంగరించి అద్భుతమైన రచనలు, ప్రసంగాలుగా మలిచారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు జరుగుతున్న అన్యాయం, అవినీతి, దౌర్జన్యం, బానిసత్వానికి వ్యతిరేకంగా ఆయన తన రచనల ద్వారా పోరాటం సాగిస్తున్నారు. తన కలాన్ని సమాజంలో “అణగారిన వర్గాల గొంతుగా” వినిపిస్తున్నారు. ఇదే జర్నలిజం ప్రపంచంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. కొన్నేళ్ళుగా సమాజంలో నిర్మాణాత్మకైనా మార్పు కోసం నిర్విరామంగా పనిచేస్తున్న ఈ సమాజపు విజేతల గురించి, వారు చేసిన విశేష కృషి గురించి రాయడం, వాటిని డాక్యుమెంట్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు అరవింద్ యాదవ్.
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన డాక్టర్ యాదవ్ విద్యాభ్యాసమంతా నగరంలోనే సాగింది. ఆయన సైన్స్, సైకాలజీ, న్యాయ శాస్త్రాలను అభ్యసించారు. దక్షిణాది రాజకీయాలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలపై ఆయనకు అపారమైన పరిజ్ఞానం ఉంది. వార్తలు, ప్రత్యేక కథనాల సేకరించే పనిలో భాగంగా ఆయన దక్షిణాది రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో ఆయన అనేక మారుమూల గ్రామాలు సందర్శించి అక్కడి ప్రజల జీవన స్థితిగతులను కళ్ళకు కట్టినట్లు ప్రపంచానికి తెలియజేసారు. ఆయన అన్వేషణ, విస్తృత ప్రయాణాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.
జర్నలిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు కథా రచయితగా, జీవిత చరిత్ర రచయితగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు. సమాజ పునర్నిర్మాణంలో భాగస్వాములైన ఎంతో మంది విజేతల విజయ రహస్యాలను, వారి జీవితంలోని వివిధ కోణాలను ఆవిష్కరించి, లక్ష్యసాధన దిశగా ప్రజలను చైతన్య పరచడమే తన ప్రధమ ప్రాధాన్యతగా పెట్టుకున్నారు డాక్టర్ అరవింద్ యాదవ్.
అరవింద్ యాదవ్ భారతదేశంలోని వివిధ రంగాలకు చెందిన విశిష్టమైన పలువురి జీవితాలను డాక్యుమెంట్ చేశారు. 'భారతరత్న' డాక్టర్ సిఎన్ఆర్ రావు, భారతదేశపు మొట్ట మొదటి మహిళా కార్డియాలజిస్ట్ డాక్టర్ పద్మావతి, సామాజిక కార్యకర్త పూల్బాసన్ యాదవ్ తోపాటు ఎంతో మంది ప్రముఖుల జీవిత చరిత్రలను మనకు అందించారు. డా. యాదవ్ గారు ఇప్పటి వరకు 20 పుస్తకాలు, అనేక వ్యాసాలు రాశారు.
జర్నలిస్టుగా 1999 నుండి 2019 వరకు డాక్టర్ యాదవ్ దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను కవర్ చేశారు. ఆజ్ తక్ /హెడ్లైన్స్ టుడే, IBN 7, TV9 న్యూస్ నెట్వర్క్ వంటి ప్రముఖ సంస్థలలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. భారతదేశపు మొదటి HD న్యూస్ ఛానెల్ - సాక్షి టీవీని స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. యువర్ స్టోరీ వెబ్ సైట్లో భారతీయ భాషలన్నింటికీ మేనేజింగ్ ఎడిటర్ గా పనిచేశారు
ఎంతో మంది జర్నలిజం రంగంలోకి ప్రవేశిస్తారు. కానీ డాక్టర్ అరవింద్ యాదవ్ వంటి వారు మాత్రమే తమ విశిష్ట కృషితో ఆ రంగానికి వన్నె తెస్తారు. సామాజిక, రాజకీయ చైతన్యం కలిగించే కార్యక్రమాలలో నిమగ్నమై ఉండటమే కాకుండా సామాజిక న్యాయం, పత్రికా స్వేచ్ఛ కోసం ఆయన అహర్నిశలూ పోరాడుతూనే ఉన్నారు.
అరవింద్ యాదవ్ ఒక సాహితీవేత్త కూడా. హిందీ సాహిత్య విమర్శలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. "నిర్మాణాత్మకమైన విమర్శ" ఆయన సహజ లక్షణం. ఆయన విమర్శించే తీరు సమాజం తీరును కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. హిందీ విమర్శ మౌఖిక సంప్రదాయాన్ని ఆయన ఉత్సాహంగా ప్రచారం చేస్తునారు.
క్షణం కూడా తీరిక ఉండని జర్నలిజం, మీడియా రంగాలలో ఉంటూనే తనకు ఇష్టమైన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రపీని, పర్యటనలను కొనసాగిస్తూనే ఉన్నారు. వీలు చిక్కినప్పుడల్లా కొండకోనలు, అడవుల్లో సంచరిస్తూ తన కెమెరాతో “క్లిక్” మనిపిస్తారు. దేశమంతా “చక్కర్లు” కొడతారు. ఆయన జీవితం అనేక అనుభవాల సంపుటి.
The items in your Cart will be deleted, click ok to proceed.